varun tej: బుల్లితెర రేటింగ్స్ లో మగధీర .. బాహుబలి తరువాత 'ఫిదా'నే!

  • బుల్లితెరపై 'ఫిదా' జోరు
  • క్రితం నెల 24న 'స్టార్ మా'లో ప్రసారం
  • అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టింది
  • భారీ చిత్రాల సరసన 3వ స్థానాన్ని దక్కించుకుంది

ఓ మాదిరి బడ్జెట్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోయింది. అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్టయ్యే కథ కావడంతో, టీవీలోను ఈ సినిమాకి ఒక రేంజ్ లో టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

'స్టార్ మా' ఛానల్ వారు సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఈ సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమా 21.30 టీఆర్పీ ని సాధించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక టీఆర్పీని రాబట్టిన టాప్ 10 చిత్రాలలో 3వ స్థానాన్ని ఆక్రమించింది. 22 టీఆర్పీ ని సాధించి 'మగధీర' మొదటి స్థానంలో ఉండగా, 21.84 టీఆర్పీని రాబట్టి 'బాహుబలి' రెండవ స్థానంలో వుంది. తాజాగా 'ఫిదా' మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మధ్యాహ్నం వేళలో ప్రసారమైన ఈ సినిమా, ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ను సాధించడం విశేషం.       

More Telugu News