priest: కేరళలో దేవాలయాలకు పూజారులుగా ఆరుగురు దళితులు సహా 36 మంది బ్రాహ్మణేతరులు!

  • కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు నిర్ణయం
  • ఆ బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు
  • పలు దేవాలయాల్లో 62 మంది పూజారులను నియమించాలని నిర్ణయం

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. పలు దేవాలయాల్లో మొత్తం 62 మంది పూజారులను నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 26 మంది అగ్రకులాల వారిని, 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

వీరిలో ఆరుగురు దళితులు కూడా ఉన్నారు. దళితులను పూజారులుగా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. పూజారుల నియామ‌కాల కోసం ఇప్ప‌టికే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్ర‌క్రియ‌లో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని బోర్డు స‌భ్యులు తెలిపారు.  

  • Loading...

More Telugu News