prabhas: యూరప్ ట్రిప్ కి రెడీ అవుతోన్న ప్రభాస్ టీమ్!

  •  అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన 'సాహో' షూటింగ్
  •  నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో
  •  పాటలతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ
  •  బాలీవుడ్ నుంచి వస్తోన్న భారీ ఆఫర్లు      

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ప్రభాస్ ఆఫీస్ సెట్లో చిత్రీకరణ చేస్తూ వచ్చారు. ఈ రోజుతో రెండవ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. క్రొయేషియా .. కోలిన్ .. ట్యూరిన్ తదితర ఫారిన్ లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలతో పాటు, పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి, అప్పుడే బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయట. 400 కోట్ల డీల్ కుదిరేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News