dhoni: ధోనీని అనుక‌రించిన కుక్క‌... వీడియో పోస్ట్ చేసిన భార్య సాక్షి

  • పెంపుడు కుక్కతో ఆడుతున్న ధోనీ
  • పెంపుడు కుక్క పేరు `శామ్‌`
  • జంతువుల‌పై ప్రేమ‌ను మ‌రోసారి నిరూపించుకున్న కెప్టెన్‌

 క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీ ఎంత కూల్‌గా ఉంటాడో ఈ వీడియో చూస్తే మ‌రోసారి అర్థ‌మవుతుంది. త‌న‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్ట‌మ‌ని ఆయ‌న చెప్పిన మాట‌ను మ‌రోసారి రుజువు చేసుకున్నాడు. త‌మ పెంపుడు కుక్క `శామ్‌`తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయ‌న భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

`బెల్జియ‌న్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ కు అనుక‌రించే టాలెంట్ వుంది` అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పిన‌ట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుక‌రించ‌డం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ విజ‌యం త‌ర్వాత ఇంట్లో సేద‌దీరుతున్న ధోనీ ఇటీవ‌ల త‌మ ఇంటికి బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News