pavan: పవన్, త్రివిక్రమ్ మూవీకి నెల్లూరు ఏరియా నుంచి ఫ్యాన్సీ ఆఫర్!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ మూవీ 
  • 'అజ్ఞాత వాసి' టైటిల్ వైపు మొగ్గు
  • అన్ని ఏరియాల నుంచి భారీ ఆఫర్లు 
  • కీర్తి సురేష్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు            

పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. గతంలో త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

 ఈ సినిమా రైట్స్ కోసం అన్ని ఏరియాల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమా నెల్లూరు ఏరియా రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ 4.05 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఏరియా నుంచి ఈ స్థాయిలో ఫ్యాన్సీ ఆఫర్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. సాధారణంగానే పవన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది 25వ సినిమాగా ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ వుంది. అదే ఈ స్థాయిలో ఈ సినిమాకి ఆఫర్ రావడానికి కారణమని అంటున్నారు.        

More Telugu News