actor: సినిమా కోసం డమ్మీ గన్ ను పట్టుకున్న నటుడిపై పోలీసుల కాల్పులు... వీడియో చూడండి!

  • షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా చూసిన పోలీసు
  • సినిమా అని చెబుతున్నా వినకుండా ఫైరింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు

అతను ఓ సినిమా నటుడు. చిత్రం షూటింగ్ నిమిత్తం దోపిడీదారు మాదిరిగా వేషం వేసుకుని ముఖానికి మాస్క్ తగిలించుకుని తన తదుపరి సన్నివేశం చిత్రీకరణ కోసం సిద్ధమవుతుండగా, అతని చేతిలోని డమ్మీ గన్ ను చూసిన ఓ పోలీసు, అతనిపై కాల్పులు జరిపాడు. పోలీసు అధికారి డ్రస్ కు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డుకాగా, ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 తాను మూవీ కోసం పనిచేస్తున్నానని అతను చెబుతున్నా పోలీసు కాల్పులు జరిపాడు. అతన్ని గన్ కిందపడేయాలని హెచ్చరిస్తూ, కాల్చాడు. ఆ బులెట్ బారి నుంచి తృటిలో తప్పించుకున్న సదరు నటుడు, చేతిలోని బొమ్మ తుపాకిని కింద పడేశాడు. ఆపై అతన్ని నేలపై పడుకోవాలని పోలీసు కోరగా, బతుకుజీవుడా అనుకుంటూ నేలపై పడుకుండి పోయాడు. ఆపై విషయం తెలుసుకున్న పోలీసులు క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారు.

 ఈ ఘటనపై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర విమర్శలతో కామెంట్లు పెడుతూ పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు. అదృష్టవశాత్తూ అతనికి బులెట్ తగల్లేదని, ఒకవేళ బులెట్ తగిలుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఆ నటుడు ఎవరన్న విషయాలు తెలియరాలేదు. 4వ తేదీన వెబ్ సైట్లలో అప్ లోడ్ అయిన ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News