lasvegas: పెడ్డాక్ చెబితేనే ఫిలిప్పీన్స్ వెళ్లాను... అతను చాలా మంచోడు!: లాస్ వెగాస్ మారణహోమ కారకుడి ప్రియురాలు

  • స్టీఫెన్ పెడ్డాక్ ప్రేమించే హృదయం కలిగిన మనిషి
  • జీవితాంతం అతనితోనే ఉండాలనుకున్నాను
  • 'ఫ్లైట్ టికెట్ చౌకగా వచ్చింది, అమ్మానాన్నలను చూసిరా' అని పంపించాడు 

లాస్ వెగాస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఐదు రోజుల తరువాత మాండలే బే పరిసరాల్లోని రిసార్టులకు పర్యాటకులు వస్తున్నారు. మరోవైపు దారుణ మారణకాండకు పాల్పడిన స్టీఫెన్ పెడ్డాక్ గురించిన వివరాల సేకరణలో ఎఫ్బీఐ అధికారులు బిజీగా ఉన్నారు. పెడ్డాక్ ప్రియురాలు 'మారిలో డాన్ లో'ను ఫిలిప్పీన్స్ నుంచి రప్పించిన ఎఫ్బీఐ అధికారులు, ఆమెను విచారిస్తున్నారు. అయితే ఆమె స్టీఫెన్ పెడ్డాక్ చాలా మంచి వ్యక్తి అని చెబుతోంది. అంతకంటే ప్రేమించే హృదయం కలిగిన మనిషని తెలిపింది.

తనను చాలా బాగా చూసుకునేవాడని, అందుకే జీవితాంతం అతనితోనే ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. అయితే ఈ దారుణానికి పెడ్డాక్ పాల్పడ్డాడంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆమె చెప్పింది. విమానం టికెట్ చౌకగా వచ్చింది, వెళ్లి మీ తల్లిదండ్రులను చూసిరా అని అతను చెబితేనే తాను ఫిలిప్పీన్స్ వెళ్లానని ఆమె చెప్పింది. ఫిలిప్పీన్స్ లో ఇల్లు కొనేందుకు డబ్బులు కూడా పంపాడని ఆమె తెలిపింది. అంతకు మించి తనకు తెలియదని ఆమె చెప్పింది. అయితే మతమార్పిడి, ఉన్మాద లక్షణాలు, అసహజ ప్రవర్తన వంటి అంశాలపై ఆమెను ప్రశ్నించాల్సి ఉందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News