autobiography: స్వీయ చ‌రిత్ర రాయ‌నున్న భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్‌

  • వ్య‌క్తిగ‌త‌, క్రీడాగ‌త జీవితానికి పుస్త‌క‌రూపం తీసుకురానున్న మిథాలీ
  • ప్ర‌చురించ‌నున్న పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్‌
  • బాలిక‌ల‌కు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంద‌న్న క్రీడాకారిణి

భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ గా ఎద‌గ‌డంలో తాను ఎదుర్కున్న ఒడిదుడుకులకు, తాను సాధించిన విజ‌యాల‌కు పుస్త‌క రూపం క‌ల్పించ‌నున్న‌ట్లు మిథాలీ రాజ్ తెలిపారు. త‌న స్వీయ చ‌రిత్ర బాలిక‌ల‌కు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంద‌ని ఆమె అన్నారు. ఆమె స్వీయ‌చ‌రిత్రను ప్ర‌చురించే హ‌క్కుల‌ను పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ సంస్థ సొంతం చేసుకుంది.

`మిథాలీ రాజ్ ఈనాటి యువ‌త‌కు ఆద‌ర్శం. క‌ష్ట‌ప‌డితే విజ‌యం త‌ప్ప‌కుండా వ‌రిస్తుంద‌ని ఆమె నిరూపించింది` అని పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ ప్ర‌తినిధి రాధిక మార్వా తెలిపారు. మిథాలీ రాజ్‌ 19 ఏళ్ల‌కే అర్జున అవార్డు గెలుచుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News