apcc: ఈ నెల 10న ఏపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక

  • అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఎన్నిక
  • ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న
  • విజ‌య‌వాడ‌లోని ఐవీ ప్యాలెస్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు మొదటి స‌మావేశం

అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఈ నెల 10న ఏపీసీసీ అధ్య‌క్షుడి ఎన్నిక జ‌రుగుతుంద‌ని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మునియ‌ప్ప అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల ప్రక్రియ‌లో భాగంగా నూత‌నంగా ఎన్నికయిన 278 మంది పీసీసీ స‌భ్యులతో విజ‌య‌వాడ‌లోని ఐవీ ప్యాలెస్‌లో ఈ నెల 10న ఉద‌యం 10 గంట‌ల‌కు మొదటి స‌మావేశం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ స‌మావేశంలోనే ఏపీసీసీ కార్య‌వ‌ర్గ స‌భ్యులను కూడా ఎన్నుకుంటారని తెలిపారు.       

More Telugu News