indian air force: ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం వస్తే... మా దగ్గర ప్లాన్ బీ ఉంది: ఎయిర్ ఫోర్స్ చీఫ్

  • సర్జికల్ స్ట్రయిక్స్ కి సిద్ధం
  • చైనా, పాక్ లతో టూ-ఫ్రంట్ వార్ కు కూడా రెడీ
  • సర్వసన్నద్ధంగా ఉన్నామన్న వాయుసేన చీఫ్

భారత ప్రభుత్వం అనుమతిస్తే పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ దనోవ్ ప్రకటించారు. వాయుసేన 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రభుత్వం ఆదేశిస్తే, ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిలో పాల్గొంటుందని చెప్పారు. భారత వాయుసేన సర్వసన్నద్ధంగా ఉందని... ఎలాంటి పోరాటాన్ని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమని అన్నారు.

చైనాను ఎదుర్కోవడానికి కానీ లేదా చైనా, పాకిస్థాన్ లతో ఒకేసారి తలపడటానికి గానీ భారత్ సిద్ధంగా ఉందని దనోవ్ తెలిపారు. ఇరు దేశాలను ఎదుర్కోవడానికి 42 స్క్వాడ్రన్లు అవసరమవుతాయని... ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ వద్ద ప్లాన్ బీ ఉందని చెప్పారు. అయితే టూ-ఫ్రంట్ వార్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. 2032 కల్లా 42 ఫైటర్ స్క్వాడ్రన్లను చేరుకుంటామని చెప్పారు. 

More Telugu News