sharwanand: 'మహానుభావుడు' కోసం థియేటర్లు పెంచేశారు!

  •  నిలకడగా 'మహానుభావుడు' వసూళ్లు
  •  వీకెండ్ లో పెరగనున్న జోరు
  •  100 థియేటర్లను పెంచేశారు 
  •  హైదరాబాద్ లోనే 70 థియేటర్లను కేటాయించారు  

ఎన్టీఆర్ .. మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో ఉండగా, 'మహానుభావుడు' సినిమాతో ధైర్యంగా శర్వానంద్ ముందుకొచ్చాడు. ఈ సినిమా కంటెంట్ పై టీమ్ పెట్టుకున్న నమ్మకం వృథా కాలేదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ సినిమాకి పోటీగా ఈ వీకెండ్ లో మరో సినిమా ఏదీ లేకపోవడంతో, అదనంగా మరో 100 థియేటర్లను పెంచారట. ఒక్క హైదరాబాద్ లోనే 70 థియేటర్లను పెంచినట్టుగా చెబుతున్నారు. దీని వలన వీకెండ్ వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక చిన్న సినిమాకి రెండవ వారంలో ఈ స్థాయిలో థియేటర్లను పెంచడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కథ .. కథనాలు ఆ రెండింటితో కలిపి అందించిన కామెడీ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు.    

More Telugu News