varalakshmi: రానా చేతుల మీదుగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

  • త్రిభాషా చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్
  • తెలుగు టైటిల్ గా 'శక్తి' ఖరారు
  • డిఫరెంట్ లుక్ తో వరలక్ష్మి  
తమిళంలో యూత్ లో మంచి క్రేజ్ వున్న కథానాయికలలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. బొద్దుగా వుండే ఈ భామ తమిళంలో ఒక సినిమా చేస్తోంది. తెలుగుతో పాటు మలయాళంలోను ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాకి 'శక్తి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి ఫస్ట్ లుక్ ను రానా తన ట్విట్టర్ పేజ్ ద్వారా రివీల్ చేశాడు.

ఇక తమిళ పోస్టర్ ను శివకార్తికేయన్ చేతుల మీదుగా .. మలయాళ పోస్టర్ ను దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రివీల్ చేయించారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోంది. వరలక్ష్మి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, తమిళంలో మంచి క్రేజ్ వున్న నటుడు విలన్ గా చేస్తున్నాడు. ఈ త్రిభాషా చిత్రంతో వరలక్ష్మి ఎలా మెప్పిస్తుందో చూడాలి.    
varalakshmi

More Telugu News