lasvegas: అక్కడ తుపాకీ అంగట్లో వస్తువే... నిబంధనల్లేవ్!

  • విచ్చల విడిగా తుపాకుల దుకాణాలు
  • గన్ కొనుగోలు పర్మిషన్ తో పని లేదు
  • ఎవరైనా గన్ కొనుక్కోవచ్చు..ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు

మండలే బే రిసార్ట్ ఘటన అనంతరం అమెరికాలోని గన్ కల్చర్ గురించిన పలు విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో గన్ అంగట్లో వస్తువు, కూరగాయల్లా కొనుక్కోవచ్చు. అమెరికాలో ప్రతి పౌరుడు గన్ కలిగి ఉండొచ్చని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఆఖరుకి పోలింగ్ సమయంలో కూడా తనతోపాటు గన్ తీసుకెళ్లవచ్చట.

అసలు అక్కడ గన్ కొనుక్కునేందుకు ఎలాంటి పర్మిట్ అవసరం లేదు. డ్రైవింగ్ కు లైసెన్న్ ఉండాలి కానీ, ప్రాణాలు తీసే గన్ కొనుగోలుకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకపోవడం విశేషం. ఈ విచ్చలవిడితనమే అమెరికాలో ఇలాంటి హింసాకాండకు కారణమవుతోందన్న వాదన వుంది. లాస్ వెగాస్ ఘటన అనంతరం మరోసారి అమెరికాలోని గన్ కల్చర్ పై చట్టాలను సమీక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News