kangana ranout: దీపికా పదుకునే ప్రవర్తన ఏ మాత్రం సరిలేదు, ఏడుపొస్తోంది... హృతిక్ కు రాసిన ఈ-మెయిల్ లో కంగనా రనౌత్

  • ఈ-మెయిల్స్ బయటపెట్టిన 'ఇండియా డాట్ కామ్'
  • దీపిక ప్రవర్తనపై ఎన్నో సందేహాలు ఉన్నాయి
  • ఆమె వైఖరితో తనకు ఏడుపు వస్తోందని రాసిన కంగనా
బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న హృతిక్ రోషన్, కంగనా రనౌత్ న్యాయ పోరాటంలో, వారిద్దరి మధ్యా సాగిన ఈ-మెయిల్స్ సంభాషణలు కీలకం కాగా, తాజాగా, కొన్ని వివాదాస్పద ఈ-మెయిల్స్ బయటకు వచ్చాయి. వీటిల్లో హీరోయిన్ దీపికా పదుకొనే పేరును కంగనా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

'ఇండియా డాట్ కామ్' వెల్లడించిన కథనం ప్రకారం, దీపికా ప్రవర్తన ఏ మాత్రం సరిగ్గా లేదని, ఇదే విషయాన్ని తాను ఎన్నోమార్లు హృతిక్ వద్ద ప్రస్తావించానని కంగనా వ్యాఖ్యానించింది. దీపిక వ్యవహారాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని వాపోయింది. తన మనసులో దీపికపై మంచి అభిప్రాయం లేదని, ఆమె గత నాలుగు రోజులుగా తనకు ఫోన్ కాల్స్ చేయలేదని తెలిపింది.

'తన గురించి నాకు తెలిసిపోయినట్టు భావించబట్టే, దీపిక నాకు దూరం అవుతోందని అనుకుంటున్నా' అంటూ చెప్పింది. ఆమె అర్థరహితమైన పనులతో తాను విసుగు చెందినట్టు చెప్పుకుంది. ఆమెపై తనకెన్నో సందేహాలున్నాయని, తాను ప్యానిక్ అవుతున్నానని, తనకు ఏడవాలని ఉందని బాధపడింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హృతిక్ ను డిమాండ్ చేసింది.
kangana ranout
hritik roshan
deepika padukone

More Telugu News