prakash raj: నేను నిజమే మాట్లాడుతాను...వారికి ఆ ధైర్యం లేదు!: ప్రకాశ్ రాజ్

  • ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడుతాను
  • మోదీ విషయంలో నేను మాట్లాడింది వాస్తవమే
  • ఆయనను తప్పుపడితే 'యాంటీ మోదీ' అనేస్తారా?
  • దేశ ప్రధానిగా ఆయనంటే గౌరవం ఉంది.. అలా అని అన్నింటికీ ఆయనకు వంతపాడలేను 
నిజం మాట్లాడతానని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపాడు. బెంగళూరులో ఇటీవల హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ ఘటన విషయంలో ప్రధాని తీరుపై అసహనం వ్యక్తం చేయడంపై లక్నోకి చెందిన న్యాయవాది కేసు దాఖలు చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానెప్పుడైనా, ఎక్కడైనా సరే నిజమే మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోదీ విషయంలో కూడా తాను నిజమే మాట్లాడానని ఆయన చెప్పారు.

నిజం మాట్లాడినంత మాత్రానికే 'యాంటీ మోదీ' అనేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ మన దేశ ప్రధాని అని, ఆయనపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆయన తెలిపారు. అదే సమయంలో అన్ని విషయాల్లోనూ తాను ఆయనతో ఏకీభవించలేనని చెప్పారు. ఇక తనను దూషించే వారు, విమర్శించేవారిని ఉద్దేశిస్తూ, వారెవరూ తన ఎదురుగా వచ్చి అలా చేయలేరని ఆయన అన్నారు. అంత ధైర్యం వారికి లేదని ఆయన తెలిపారు. ఎంత విమర్శించినా గౌరీలంకేశ్ మరణంపై తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడతానని ఆయన తెలిపారు. 
prakash raj
modi
comments
case

More Telugu News