biopic: వెండితెర‌పై మ‌రో బ‌యోపిక్‌... ఈసారి శాస్త్ర‌వేత్త జీవిత‌క‌థ‌

  • ఇస్రో మాజీ చైర్మ‌న్ కె. రాధాకృష్ణ‌న్ జీవితంపై సినిమా
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న నిఖిల్ అడ్వాణీ
  • `మై ఒడిస్సీ` పుస్త‌కం స్ఫూర్తి

బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ట్రెండ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు అదే బాట‌లో క్రీడాకారులు, సినీ తార‌లు, రాజ‌కీయ నాయకుల బ‌యోపిక్‌ల‌తో పాటు శాస్త్ర‌వేత్త‌ల బ‌యోపిక్‌లు కూడా చేరే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. త్వ‌ర‌లో ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ జీవితం ఆధారంగా సినిమా తీయ‌నున్న‌ట్లు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ తెలిపారు.

మంగ‌ళ్‌యాన్ మిష‌న్‌లో కీల‌క పాత్ర పోషించిన రాధాకృష్ణ‌న్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆయ‌న జీవితంపై సినిమా తీయాల‌నే ఆలోచ‌న క‌లిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాధాకృష్ణ‌న్ రాసిన `మై ఒడిస్సీ` పుస్త‌కం తనకు చాలా స్ఫూర్తినిచ్చింద‌ని నిఖిల్ చెప్పారు. ఎమ్మె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనిపై రాధాకృష్ణ‌న్ కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. మారుమూల గ్రామం నుంచి వ‌చ్చిన తాను ఇస్రో చైర్మ‌న్ స్థాయికి ఎద‌గ‌డానికి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ రావాల్సి వచ్చిందని, ఆ సంగ‌తుల‌న్నీ సినిమాగా చూపిస్తే యువ‌త‌కు ఆద‌ర్శంగా ఉంటుంద‌ని రాధాకృష్ణ‌న్ చెప్పారు.

More Telugu News