raviteja: 'రాజా ది గ్రేట్'కి రిలీజ్ డేట్ ఖరారు

  •  అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' 
  •  చూపులేని వ్యక్తిగా రవితేజ 
  •  ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్
  •  దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల    

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా నటించగా, ఆయన జోడీగా మెహ్రీన్ సందడి చేయనుంది. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేద్దామనుకున్నారు. ఆ మరుసటి రోజునే 'రాజుగారి గది 2' రిలీజ్ ఉండటంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 అదే డేట్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రవితేజ, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక పటాస్ .. సుప్రీమ్ హిట్స్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా ఇది. అలాగే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' .. 'మహానుభావుడు' హిట్స్ తరువాత మెహ్రీన్ ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ ఇద్దరికీ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.     

More Telugu News