taj mahal: నేటి రాత్రి తాజ్ మహల్ వద్ద మరో అద్భుతం... క్యూ కడుతున్న పర్యాటకులు

  • నేడు శరద్ పూర్ణిమ
  • తాజ్ పై పడనున్న వెండి వెలుగులు
  • చేరుకుంటున్న దేశ విదేశీ పర్యాటకులు
  • రాత్రి 8.30 నుంచి 12.30 వరకూ అద్భుతం
శరద్ పూర్ణిమ... శరదృతువులో ఆశ్వయుజ మాసంలో వచ్చే పున్నమి. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు భూమికి మరింత దగ్గరగా వచ్చే చంద్రుడు, నిండుగా వెండి వెలుగులను విరజిమ్మే రోజు. ఇక స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ప్రపంచ ఏడు వింతల్లోని తాజ్ మహల్ పై పడే శరద్ చంద్రుని వెన్నెల ఓ అద్భుతం.

తాజ్ మహల్ పాలరాళ్లపై పడే చంద్రుని వెలుగులను వీక్షించడానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. పూర్ణ చంద్రుని కిరణాలు తాజ్ పై పడి మెరుస్తుంటే, ఆ అద్భుతాన్ని చూడటానికి ఇప్పటికే ఆగ్రాకు దేశ, విదేశీ పర్యాటకులు క్యూ కట్టారు. నేటి రాత్రి 8.30 నుంచి 12.30 గంటల వరకూ పున్నమి చంద్రుడి కాంతులను తాజ్ పై చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
taj mahal
sarad poornima
moon light

More Telugu News