Arvind kejriwal: నేను ఎన్నికైంది ముఖ్యమంత్రిగా.. ఉగ్రవాదిగా కాదు: లెఫ్టినెంట్ గవర్నర్‌పై చిందులు తొక్కిన కేజ్రీవాల్

  • తాజా విదాదానికి కారణమైన టీచర్ల క్రమబద్ధీకరణ
  • గవర్నర్ వ్యతిరేకిస్తున్నా బిల్లు పాస్ చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం
  • దేశం నడుస్తోంది బ్యూరోక్రసీపై కాదని ఘాటు వ్యాఖ్య

తాను ఎన్నికైంది ముఖ్యమంతిగా అనీ, ఉగ్రవాదిగా మాత్రం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్రోశించారు. 1500 మందిని కాంట్రాక్ట్ టీచర్లగా నియమించిన ప్రభుత్వం  500 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తాజా వివాదానికి కారణమైంది. టీచర్లను రెగ్యులరైజ్ చేసే బిల్లు విషయంలో మరోసారి ఆలోచించాలని ఎల్‌జీ అనిల్ బైజాల్ కోరగా స్పందించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, ఉగ్రవాదిగా కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బ్యూరోక్రాట్లపైనా విరుచుకుపడ్డారు. మనం ఢిల్లీ నేతలమని (మాస్టర్స్), బ్యూరోక్రాట్లం కామని తేల్చి చెప్పారు. దేశం ప్రజాస్వామ్యంపై నడుస్తోందని, బ్యూరోక్రసీపై కాదనగానే ఆప్ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, ఉగ్రవాదిగా కాదని, అతడు (సిసోడియా) విద్యాశాఖ మంత్రి అని, ఉగ్రవాది కాదని సీఎం తేల్చి చెప్పారు. టీచర్ల క్రమబద్ధీకరణను పునఃపరిశీలించాల్సిందిగా కోరిన గవర్నర్ కోర్టులోనే బంతి ఉందని, ఇప్పుడు ఆయనే నిర్ణయం తీసుకోవాలని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News