ganguly: ఈ 15 నెలల్లో కోహ్లీ నిరూపించుకుంటే గొప్ప కెప్టెన్ అనిపించుకుంటాడు: గంగూలీ

  • కోహ్లీ కెరీర్ లో రానున్న 15 నెలల కాలం ఎంతో కీలకమైనది
  • గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు కోహ్లీకి సదావకాశం
  • 15 నెలల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలతోపాటు ప్రపంచకప్ కూడా ఆడాల్సిఉంది
  • సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్
టీమిండియాకు ఎంతో మంది కెప్టెన్ లుగా వ్యవహరించారు. అయితే కపిల్ దేవ్, అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర  సింగ్ ధోనీలను మాత్రమే దిగ్గజ కెప్టెన్లుగా పేర్కొంటారు. ఆ జాబితాలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాలంటే రానున్న 15 నెలలు తానేంటో నిరూపించుకోవాలని జట్టు దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. బెంగల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన గంగూలీ తన అభిప్రాయాలు చెబుతూ, వరుస విజయాలు సాధిస్తున్న కోహ్లీ గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని అన్నాడు, అయితే అతనికి వచ్చే పదిహేను నెలల కాలం ఎంతో కీలకమైనదని గుర్తుచేశాడు.

 టీమిండియా ప్రస్తుతానికి టెస్టులు, వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పిన గంగూలీ ఈ స్థానాన్ని నిలుపుకోవాలంటే చాలా కష్టపడాలని సూచించాడు. దానికి రానున్న 15 నెలల కాలం చాలా కీలకమైనదని స్పష్టం చేశాడు. కాగా, రానున్న 15 నెలల కాలంలో టీమిండియా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలతోపాటు ప్రపంచకప్ కూడా ఆడాల్సి ఉందని అన్నాడు. ఈ సమయంలోనే కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో తన వరల్డ్ కప్ జట్టును కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశాడు. ప్రధానంగా సౌతాఫ్రికా పర్యటన కోహ్లీకి అసలైన సవాలని తెలిపాడు. 
ganguly
kohli
team India
cricket

More Telugu News