suhasini: హీరోలే రాజకీయాల్లోకి రావాలా?... మేము రాకూడదా?: సుహాసిని సంచలన వ్యాఖ్యలు

  • హీరోలే రాజకీయాల్లోకి రావాలా?.. మేము రాకూడదా?
  • రాజకీయాల్లోకి రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం
  • తమిళనాట ఆసక్తి పెంచుతున్న సుహాసిని వ్యాఖ్యలు
తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ ఆసక్తి రేపుతోంది. జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగప్రవేశానికి రజనీకాంత్, కమలహాసన్ పావులు కదుపుతున్న నేపథ్యంలో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలో ఆమె మాట్లాడుతూ, 'హీరోలే రాజకీయాల్లోకి రావాలా, మేము రాజకీయాల్లోకి రాకూడదా?' అంటూ ప్రశ్నించింది. తమిళ ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం’ అని సుహాసిని చెప్పింది. మరోవైపు ఆమె సమకాలీనులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
suhasini
politician
tamilnadu

More Telugu News