విజయవాడ కేంద్రంగా ఆపరేషన్స్‌కు సిద్ధమైన ‘ఇండిగో’.. 50 విమానాలకు ఆర్డర్!
- ఆరు నెలల క్రితమే అధ్యయనం
- దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచే సర్వీసులు
- భారీగా ఉద్యోగుల నియామకం
- సంస్థల మధ్య పోటీ పెరిగి ధరలు తగ్గే అవకాశం
విజయవాడ కేంద్రంగా విమాన సర్వీసులు నడపాలని ఇండిగో ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం విజయవాడలో అధ్యయనం కూడా చేసినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్ణయానికి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఎయిరిండియా, స్పైస్‌జెట్ సంస్థలు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. దీంతో చార్జీలు భారీగా ఉంటున్నాయి. ఒకసారి ఇండిగో కనుక ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున విమాన సర్వీసులు ప్రారంభిస్తే వీటి మధ్య పోటీ నెలకొని ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.