hebba patel: ఈసారైనా హెబ్బా పటేల్ కి హిట్ దక్కేనా?

  • హెబ్బా పటేల్ తాజా చిత్రంగా 'ఏంజెల్'
  • ఈ మూవీకి ముందు వరుస పరాజయాలు 
  • నవంబర్ 3న 'ఏంజెల్' విడుదల
  • ఈ సినిమాపైనే హెబ్బా ఆశలు

కెరియర్ ఆరంభంలో వరుస సక్సెస్ లను అందుకుంటూ వచ్చిన హెబ్బా పటేల్, అందరితోనూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్ తరువాత ఆమెను సక్సెస్ పలకరించలేదు. 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' .. 'మిస్టర్' .. 'అంధగాడు' సినిమాల ఫలితాలు తేడా కొట్టేశాయి.

వరుస పరాజయాలతో డీలాపడిపోయిన హెబ్బా పటేల్, 'ఏంజెల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగ అన్వేష్ సరసన హెబ్బా పటేల్ చేసిన ఈ సినిమాను, నవంబర్ 3వ తేదీన విడుదల చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే రోజున మరో మూడు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా హెబ్బా పటేల్ కి  హిట్ దక్కుతుందేమో చూడాలి.      

More Telugu News