rbi: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ!

  • రెపోరేటు 6, రివ‌ర్స్ రెపో రేటు 5.75 శాతం
  • 7.3 శాతం నుంచి 6.7 శాతానికి వృద్ధిరేటు అంచ‌నా సవరణ
  • ద్ర‌వ్యోల్బ‌ణం 4.2 నుంచి 4.6 శాతానికి పెరుగుతుంద‌ని అంచ‌నా

ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానంపై ఈ రోజు ఐదుగురు ఆర్‌బీఐ అధికారుల బృందం స‌మీక్ష జ‌రిపి కీల‌క నిర్ణయాలు తీసుకుంది. భార‌త్‌లో అమ‌ల్లోకి వ‌చ్చిన‌ జీఎస్‌టీని కూడా దృష్టిలో ఉంచుకుని కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంటే రెపోరేటు 6 , రివ‌ర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండ‌నుంది. అలాగే, వృద్ధిరేటు అంచ‌నాను 7.3 శాతం నుంచి 6.7 శాతానికి ఆర్‌బీఐ స‌వ‌రించింది. ద్ర‌వ్యోల్బ‌ణం 4.2 నుంచి 4.6 శాతానికి పెరుగుతుంద‌ని అంచ‌నా వేసింది. 

rbi

More Telugu News