dharmavaram: సాక్షి వార్తాపత్రికపై కోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్యే

  • తప్పుడు కథనాలను ప్రచురించారు
  • సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి
  • రూ. 5 కోట్ల పరువునష్టం దావా కూడా వేస్తా

సాక్షి దినపత్రికపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఓ మహిళను వేధించానంటూ సాక్షిలో తప్పుడు కథనాలను ప్రచురించారని, తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. సాక్షిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరారు. సాక్షి మీడియాను నిషేధించాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పుడు కథనాలను ప్రచురించిన సాక్షిపై రూ. 5 కోట్ల పరువునష్టం దావా కూడా వేస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News