petrol: కేంద్రం రూ. 2 తగ్గిస్తే మరింతగా దిగొచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు... వివిధ నగరాల్లో ఇలా!

  • రూ. 2.50 వరకూ తగ్గిన పెట్రోలు ధరలు
  • రూ. 2.41 వరకూ తగ్గిన డీజిల్ ధర
  • హైదరాబాద్ లో పెట్రోలు రూ. 72.40, డీజిల్ రూ. 61.81

పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు ఊరటను కలిగిస్తూ, రూ. 2 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ధరలు మరింతగా తగ్గాయి. కేంద్రం నిర్ణయం తీసుకున్న సమయంలోనే క్రూడాయిల్ బాస్కెట్ ధర కూడా తగ్గడంతో ధరలు ఇంకాస్త దిగివచ్చాయి. లీటరు డీజిల్ పై న్యూఢిల్లీలో రూ.2.25, కోల్‌ కత్తాలో రూ.2.25, ముంబైలో రూ.2.38, చెన్నైలో రూ.2.41 తగ్గింది.

ఇక నేటి ధరల విషయానికి వస్తే, లీటరు డీజెల్ ధర న్యూఢిల్లీలో రూ. 56.89గా ఉండగా, కోల్‌ కత్తాలో రూ. 59.55గా, ముంబైలో రూ. 60.43గా, చెన్నైలో రూ. 59.89గా, హైదరాబాద్ లో రూ. 61.81 గా ఉంది. ఇక పెట్రోలు విషయానికి వస్తే, లీటరుపై రూ. 2.50 వరకూ ధర తగ్గింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌ ధర న్యూఢిల్లీలో రూ. 68.38గా, కోల్‌ కత్తాలో రూ.71.16గా, ముంబైలో రూ. 77.51గా, చెన్నైలో రూ. 70.85గా, హైదరాబాద్ లో రూ. 72.40గా ఉంది.

కాగా, ఎన్డీయే సర్కారు కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తరువాత, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఇదే మొదటిసారి. ఈ తగ్గింపు అనంతరం పెట్రోలుపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం రూ. 19.48గా, డీజిల్ పై వసూలు చేస్తున్న సుంకం రూ. 15.33గా ఉంది.

More Telugu News