geeta: ఈ ఒక్క సాయం చేయండి... లక్ష రూపాయలు ఇప్పిస్తా: సుష్మా స్వరాజ్ ఆఫర్

  • గీత తల్లిదండ్రులను గుర్తించండి
  • ప్రజలను అభ్యర్థించిన విదేశాంగ మంత్రి
  • 11 ఏళ్ల వయసులో తప్పిపోయి పాక్ వెళ్లిన గీత
  • 13 ఏళ్ల తరువాత 2015లో పునరాగమనం

ఇండియా నుంచి పొరపాటున పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడే 13 సంవత్సరాలు ఆశ్రయం పొంది, దాదాపు రెండేళ్ల క్రితం భారత ప్రభుత్వం చొరవతో ఇండియాకు వచ్చిన మూగ, బధిర యువతి గీత, తల్లిదండ్రులను వెతికి కనిపెట్టే బాధ్యతను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రజలపైనే వేశారు. ఆమె తల్లిదండ్రులు ఎవరో గుర్తించిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పారు. గీత బీహార్ లేదా జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఓ కుటుంబానికి చెందిన బాలికై ఉండవచ్చని అభిప్రాయపడ్డ ఆమె, తల్లిదండ్రులను గుర్తించేందుకు సాయపడాలని అభ్యర్థించారు.

కాగా, 11 సంవత్సరాల వయసులో తప్పిపోయి పాక్ చేరుకున్న గీత తొలుత లాహోర్ లోని బాలల సంరక్షణ కేంద్రంలోను, ఆపై ఏధి ఫౌండేషన్ ఆధ్వర్యంలోను ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. గీత పేరును ఫాతిమా అని పెట్టిన అక్కడి ఫౌండేషన్ అధికారులు, ఆమెను కంటికి రెప్పలా కాపాడారు. రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' చిత్రం విడుదలైన తరువాత, అదే తరహాలో ఉన్న గీత కథ బయటకు రాగా, ఆమెను తిరిగి రప్పించేందుకు సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ధను చూపారు. అక్టోబర్ 2015లో ఆమె తిరిగి ఇండియాకు రాగా, అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులను మాత్రం కనిపెట్టలేదు.

More Telugu News