Indian rail: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వచ్చే ఏడాది మార్చి వరకు టికెట్లపై సర్వీస్ చార్జ్ నిల్!

  • గతేడాది నోట్ల రద్దుతో సర్వీస్ చార్జి ఎత్తివేత 
  • ఇప్పటికి రెండుసార్లు పొడిగింపు
  • ఐఆర్‌సీటీసీ ఆదాయంలో 33 శాతం దీనిపైనే

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌ టికెట్ల  బుకింగ్‌పై సర్వీస్ చార్జీలను వచ్చే ఏడాది మార్చి వరకు వసూలు చేయబోమని ప్రకటించింది. గతేడాది నవంబరులో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్ బుకింగ్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సర్వీస్ చార్జీలను ఎత్తివేసింది. ప్రస్తుతం దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు  పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ఏడాది జూన్ 30 వరకు సర్వీస్ చార్జీలను ఎత్తివేయగా దానిని సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

నోట్ల రద్దుకు  ముందు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారి నుంచి ఐఆర్‌సీటీసీ ఒక్కో టికెట్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసేది. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ ద్వారా ఐఆర్‌సీటీసీకి 33 శాతం ఆదాయం సమకూరుతున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు వచ్చిన రూ.1500 కోట్లలో రూ.540 కోట్లు సర్వీస్ చార్జీల ద్వారా వచ్చినవేనని ఆయన తెలిపారు.

More Telugu News