mahesh babu: ఇటలీలో విహరిస్తోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ

  •  ఇటలీలో మహేశ్ ఫ్యామిలీ షికారు
  •  అందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసిన నమ్రత
  •  'స్పైడర్' ఎఫెక్ట్ తో మహేశ్ ఇల్లు కదలడం లేదనే ప్రచారానికి ఫుల్  స్టాప్    
ఒక సినిమాను అంగీకరిస్తే ఆ సినిమాపై మహేశ్ బాబు పూర్తి దృష్టి పెడతాడు. అనుకున్న సమయానికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తాడు. అంతలా కష్టపడే ఆయన ఆ తరువాత సరదాగా  ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లి వస్తుంటాడు. ప్రస్తుతం ఆయన భార్యా పిల్లలలతో కలిసి ఇటలీలో విహరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను నమ్రత పోస్ట్ చేసింది.

 'స్పైడర్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మహేశ్ బాగా అప్సెట్ అయ్యాడనీ, ఇంట్లో నుంచి కూడా బయటికి రావడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'స్పైడర్' రిజల్ట్ ఆయనని బాగా బాధపెట్టడం వల్లనే 'భరత్ అను నేను' షూటింగును కూడా పోస్ట్ పోన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నమ్రత పోస్ట్ చేసిన ఫోటో .. ఈ ప్రచారానికి తెర దింపేసింది.       
mahesh babu
rakul

More Telugu News