ys jagan: చినజీయర్ తో సమావేశమైన జగన్!

  • జీయర్ ఆశ్రమానికి వెళ్లిన జగన్
  • అరగంట సేపు చర్చ
  • పాదయాత్ర నేపథ్యంలో జీయర్ ఆశీర్వాదాలు తీసుకున్న జగన్
చినజీయర్ స్వామితో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. శంషాబాద్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు జగన్. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా జగన్ వెంట ఉన్నారు. వీరి భేటీ దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది.

సమావేశం సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిణామాలు, పార్టీలో ఎదురవుతున్న సమస్యలపై చినజీయర్ తో జగన్ చర్చించినట్టు సమాచారం. మరోవైపు త్వరలోనే చేపట్టబోతున్న పాదయాత్రకు సంబంధించి కూడా చినజీయర్ ఆశీర్వాదాలను జగన్ తీసుకున్నారని తెలుస్తోంది.
ys jagan
china jeeyar swamy
jagan meeting with china jeeyar

More Telugu News