Serena Williams: కూతురి పేరు వెన‌క ర‌హ‌స్యాన్ని వెల్ల‌డించిన సెరెనా విలియ‌మ్స్‌

  • `ఆస్ట్రేలియా ఓపెన్` అక్ష‌రాలు క‌లిసేలా అలెక్సిస్ ఒలింపియా అని పేరు
  • త‌నతో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచింద‌న్న టెన్నిస్ స్టార్‌
  • అభిమానుల‌తో పంచుకున్న సెరెనా

తన కూతురికి `అలెక్సిస్ ఒలింపియా ఒహానియ‌న్ జూనియ‌ర్‌` అని పేరు పెట్ట‌డం వెన‌క ఉన్న ర‌హ‌స్యాన్ని టెన్నిస్ సూప‌ర్‌స్టార్ సెరెనా విలియ‌మ్స్ బ‌య‌ట‌పెట్టింది. తాను గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌పుడు గెల్చుకున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లోని ఏ,ఓ అక్ష‌రాలు క‌లిసేలా త‌న‌కు ఆ పేరు పెట్టినట్లు సెరెనా వెల్ల‌డించింది. ట్విట్ట‌ర్ ద్వారా ఆమె ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది.

 త‌న‌తో పాటు తను కూడా ఆడి (కడుపులో వున్న పాప) ఆస్ట్రేలియా ఓపెన్ గెలవ‌డంలో స‌హాయప‌డినందుకు ఈ పేరు పెట్టిన‌ట్లు ఆమె తెలిపింది. 2017 జ‌న‌వరి 28న ఆమె ఆస్ట్రేలియా ఓపెన్ గెల్చుకుంది. ఇది ఆమె కెరీర్‌లో 23వ సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. అప్ప‌టికే ఆమె 8 వారాల గ‌ర్భంతో ఉన్న‌ట్లు త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించింది. సెప్టెంబ‌ర్ 1న ఆమె అలెక్సిస్‌కి జ‌న్మ‌నిచ్చింది.

More Telugu News