spyder: ‘స్పైడర్ సూపర్ హిట్’ ప్రోమో విడుదల

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో వ‌చ్చిన ‘స్పైడ‌ర్’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోన్న విష‌యం తెలిసిందే. ‘స్పైడర్ సూపర్ హిట్ ప్రోమో’ పేరిట ఈ రోజు ఆ సినిమా టీమ్ ఓ వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో మ‌హేశ్‌ బాబు చేస్తోన్న సాహ‌సం, విల‌న్ వ‌ల్ల సంభ‌విస్తోన్న ప్ర‌మాదాల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడడానికి చేస్తోన్న ప్ర‌య‌త్నాలు క‌న‌ప‌డుతున్నాయి.

 ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. మధు, నల్లమలుపు శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. హారీస్‌ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.
Go Back to Shorts
spyder

More Telugu News