balaiah: కార్యకర్తపై మ‌రోసారి చేయి చేసుకున్న బాల‌య్య‌!

  • త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఘ‌ట‌న‌
  • ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాలకృష్ణ‌
  • కార్య‌క‌ర్త తొంద‌ర‌ప‌డ‌ట‌మే కార‌ణం

ప్రముఖ న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ మరోసారి అసహనాన్ని ప్రదర్శించారు. త‌న మీద‌కి వ‌స్తున్నాడ‌నే కారణంతో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త చెంప‌ను చెళ్లుమ‌నిపించారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఎందుకంత తొందరంటూ అతనిని వారించారు.

More Telugu News