hrithik roshan: కంగనా రనౌత్ గురించి హృతిక్ రోషన్ ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే...!

  • హృతిక్ ఫిర్యాదును బయటపెట్టిన రిపబ్లిక్ టీవీ
  • ఫిర్యాదులో కంగనాపై హృతిక్ తీవ్ర ఆరోపణలు
  • లైంగికపరంగా రెచ్చగొట్టేదన్న హృతిక్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ ల వివాదం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తాజాగా, గత ఏప్రిల్ లో హృతిక్ తరపు లాయర్ మహేష్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెలుగు చూసింది. ఈ వివరాలను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కంగనపై హృతిక్ చేసిన ఆరోపణలు ఏంటో చూడండి...
  • కంగనా నన్ను నిత్యం వెంటాడి, వేధించేది
  • లైంగాకపరంగా రెచ్చగొడుతూ ఈమెయిల్స్ పంపేది
  • తనను శాశ్వత ప్రేమికుడిగా అభివర్ణించేది
  • 2009లో 'కైట్స్' సినిమా ప్రారంభానికి ముందు కంగనను తొలిసారి కలిశా
  • ఆ తర్వాత 'క్రిష్-3'లో నటించినప్పటికీ మా మధ్య స్నేహం లేదు
  • 2013లో వృత్తి పరమైన కారణాలతో కంగనను పలుసార్లు కలిశా
  • 2014లో ఆమె నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి
  • మరోవైపు నన్ను ఉద్దేశిస్తూ, కంగన సోదరి రంగోళీ నుంచి కూడా ఈమెయిల్ వచ్చింది
  • అందులో కంగనాను మానసికంగా, భావోద్వేగపరంగా రేప్ చేశానంటూ నాపై ఆరోపించింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం హృతిక్ ను ఉద్దేశించి కంగన 'సిల్లీ ఎక్స్' అంటూ అభివర్ణించింది. దీంతో, గొడవ చినికిచినికి లీగల్ ఇష్యూ వరకు వచ్చింది.
hrithik roshan
kangana ranaut
bollywood
hrithik complaint on kangana

More Telugu News