kodanda ram: సింగరేణిలో ఆ యూనియన్ ను మరోసారి గెలిపిస్తే సర్వనాశనమే!: కోదండరామ్

  • టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ను గెలిపించొద్దు
  • ఒకసారి గెలిపిస్తే కార్మికుల హక్కులు కాలరాసింది
  • మరోసారి గెలిపిస్తే సింగరేణిని నాశనం చేస్తుంది

సింగరేణి యూనియన్ ఎన్నికల ప్రచారం ముగింపుదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, సింగరేణి ఎన్నికల్లో ఒక దఫా టీబీజీకేఎస్‌ ను గెలిపిస్తే కార్మికులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. కార్మికులకు ఎలాంటి హక్కులు సాధించిపెట్టలేదని, మళ్లీ మరోసారి దానిని గెలిపిస్తే సింగరేణిని నాశనం చేస్తుందని ఆయన విమర్శించారు.

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడానికి కారణం సింగరేణి సంస్థేనని ఆయన చెప్పారు. అలాంటి సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టీబీజీకేఎస్ ను మరోసారి గెలిపించవద్దని ఆయన కార్మికులకు సూచించారు. కాగా, సింగరేణిలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థగా టీబీజీకేఎస్ ఉన్న సంగతి తెలిసిందే. 

More Telugu News