south Korea: అమెరికా మాయలో పడిన చైనా తప్పు చేస్తోంది: ఉత్తరకొరియా

  • మా అంతరంగిక విషయాల్లో చైనా తలదూర్చుతోంది
  • చైనా తీరుతో సుదీర్ఘ బంధానికి బీటలు
  • మిత్ర దేశాన్ని అనుమానిస్తున్న ఉత్తర కొరియా 

అమెరికా మాయలో పడిన చైనా పెద్ద తప్పు చేస్తోందని ఉత్తరకొరియా అధికార పత్రిక రోడాంగ్ సిమోన్ ఆరోపించింది. చైనా తీరుపై ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో తమ ఆంతరంగిక విషయాల్లో చైనా తలదూర్చుతోందని మండిపడింది. అంతే కాకుండా చైనాతో అమెరికా బంధం బలపడుతోందని వ్యాఖ్యానించింది. దీనికి సాక్ష్యం అమెరికా జాతీయభద్రతా కార్యదర్శి రేటెల్లర్సన్ ఇటీవల చైనాలో పర్యటించడమేనని తెలిపింది.

ఈ బంధం వెనుక బలమైన కారణం ఉత్తరకొరియాను నాశనం చేయడమేనని స్పష్టం చేసింది. తమకు చైనాతో సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని తెలిపిన ఆ పత్రిక...ఇప్పుడా బంధం బీటలు వారిందని పేర్కొంది. ఉత్తరకొరియాపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతుంటే దానికి చైనా అభ్యంతరం చెప్పకపోవడం చూస్తుంటే..అమెరికా కుట్రలో చైనా భాగమైందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆ పత్రిక ఆక్షేపించింది. 

  • Loading...

More Telugu News