Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'ప్రేమతో పనిచేస్తా'నంటున్న రకుల్
  • చరణ్ సినిమాకి రెండు క్లైమాక్సులు 
  • 'కేరాఫ్ సూర్య' ఆడియో వేడుక 
  • ఈ నెలలోనే 'డిటెక్టివ్'గా వస్తున్న విశాల్    

*  'ఏదో పేరొస్తుందనో.. సక్సెస్ వస్తుందనో ఆశించి నేనెప్పుడూ పనిచేయను' అంటోంది బ్యూటీ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్. "ఒక సినిమా ఒప్పుకున్నాక దానిపై వంద శాతం ఎఫెర్ట్ పెడతాను. ఒక సంతృప్తితో .. ప్రేమతో పనిచేస్తాను. అలా పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది.. దాంతో పాటే పేరు కూడా వస్తుంది. అంతేకానీ, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రం పనిచేయను' అని చెప్పింది రకుల్.        
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రం కోసం రెండు క్లైమాక్సులను చిత్రీకరిస్తున్నారట. వీటిని చూసిన పిదప చిరంజీవి అభిప్రాయాన్ని బట్టి ఒక దానిని ఎంచుకుంటారని తెలుస్తోంది. ఇందులో సమంత నాయికగా నటిస్తోంది.    
*  సందీప్ కిషన్ నటిస్తున్న 'కేరాఫ్ సూర్య' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 5న నిర్వహించనున్నారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి ఒకేసారి విడుదల చేస్తారు.  
*  విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన 'తుప్పరివాలన్' తమిళ చిత్రాన్ని 'డిటెక్టివ్' పేరిట తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న కాజల్, సమంత, కీర్తి సురేష్, లింగుస్వామి కలసి రిలీజ్ చేశారు. అనూ ఇమ్మానుయేల్, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ 'డిటెక్టివ్' చిత్రాన్ని తెలుగునాట ఈ నెలలోనే విడుదల చేస్తారు.  

More Telugu News