bellamkonda srinivas: బెల్లంకొండ సినిమాకు వారణాసిలో యాక్షన్ సీన్స్!

  •  శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ
  •  కాశీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ పూర్తి
  •  పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ అదుర్స్ అంటోన్న నిర్మాత
  •  కథానాయికగా పూజా హెగ్డే      

లక్ష్యం .. లౌక్యం .. డిక్టేటర్ వంటి సినిమాలతో దర్శకుడిగా శ్రీవాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 15 రోజులుగా ఈ సినిమా షూటింగ్ ను 'కాశీ'లో జరుపుతూ వస్తున్నారు. అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారనేది తాజా సమాచారం.

 ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ .. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ను .. భారీ ఫైట్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించినట్టు చెప్పారు. 'పీటర్ హెయిన్స్' కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీవాస్ తనదైన శైలిలో ఈ సన్నివేశాలను తెరకెక్కించారనీ, అవుట్ పుట్ చాలా బాగా వచ్చినందుకు సంతృప్తిగా ఉందని అన్నారు.        

  • Loading...

More Telugu News