shivabalaji: 'బిగ్ బాస్' ప్రైజ్ మనీని విరాళంగా ఇచ్చేసిన శివబాలాజీ?

  • 'బిగ్ బాస్' విజేతగా శివబాలాజీ 
  •  50 లక్షల ప్రైజ్ మనీ సొంతం
  •  చేతికి వచ్చిన మొత్తం అనాథ శరణాలయానికి
  •  శివబాలాజీకి అభినందనలు        

 'స్టార్ మా' వారు నిర్వహించిన 'బిగ్ బాస్' కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఆయన 50 లక్షల ప్రైజ్ మనీలో .. పన్నులు మినహాయించగా 35 లక్షలను అందుకున్నాడు. ఈ ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఏం చేస్తారని ముందుగా శివబాలాజీని అడిగితే .. వేదికపై చెబుతానని అన్నాడు.

 అయితే ఆ రోజున ఆయన ఈ విషయాన్ని గురించిన ప్రకటన చేయడం మరిచిపోయాడట. ఆయన ఈ మొత్తాన్ని ఓ అనాథ శరణాలయానికి విరాళంగా అందజేశాడనేది సన్నిహితుల మాట. ఫిల్మ్ నగర్లోను .. మీడియాలోను ఇదే వార్త షికారు చేస్తోంది. అదే నిజమైతే శివబాలాజీ అందరి మనసులను గెలుచుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివబాలాజీ శ్రీమంతుల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆయన తనకి లభించిన ప్రైజ్ మనీని విరాళంగా ఇవ్వడం నిజమే కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.      

  • Loading...

More Telugu News