garikapati: అజ్ఞానాన్ని ఖండిస్తాను.. నేను చేసినా తప్పే!: గరికపాటి

  • ప్రజలను తప్పుదోవపట్టించే అజ్ఞానవ్యాప్తిని ఖండిస్తాను
  • బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు నేను వ్యతిరేకం
  • గుడ్డినమ్మకాల వ్యాప్తి మతమార్పిడికి దారితీసినా ఆశ్చర్యం లేదు 
తాను అజ్ఞానాన్ని ఖండిస్తానని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తెలిపారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, అజ్ఞానాన్ని, ప్రజలను తప్పుదోవపట్టించే తీరును సమర్థించనని చెప్పారు. దేవుడి పేరుతో మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు తాను వ్యతిరేకమని ఆయన అన్నారు.

 జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని, ఇప్పుడు ప్రజలకు జ్ఞానం పంచడం మానేసి, ప్రజలకు అజ్ఞానం పంచడం దారుణమైన విషయమని ఆయన చెప్పారు. గుడ్డినమ్మకాలను అనుసరించడం వల్ల అది చివరికి మతమార్పిడులు జరిగేందుకు దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి తీరు వల్ల మనం ఏ మతాన్నైతే సంరక్షించుకోవాలని భావిస్తున్నామో, మన తీరువల్ల అదే మతానికి హాని చేస్తున్నామని ఆయన తెలిపారు. 
garikapati
hindutva
dharmam

More Telugu News