charmi: 'బిగ్ బాస్ 2' షోలో చార్మీ .. గీతామాధురి.. హోస్ట్ గా నాని?

  •  'బిగ్ బాస్ 2'కి జరుగుతోన్న సన్నాహాలు
  •  చార్మీ .. గీతామాధురిలతో సంప్రదింపులు
  •  పరిశీలనలో మరి కొందరు సెలబ్రిటీల పేర్లు
  •  త్వరలోనే మొదలు కానున్న సీజన్ 2

'స్టార్ మా' వారు ప్రసారం చేసిన 'బిగ్ బాస్' షోకి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ లో శివ బాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండవ సీజన్ కి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే రెండవ సీజన్ కి సంబంధించిన పనులను పూర్తి చేసే ఆలోచనలో ఛానల్ నిర్వాహకులు వున్నట్టుగా చెబుతున్నారు.

రెండవ సీజన్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో చిత్రపరిశ్రమలో కొంత క్రేజ్ వున్న వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో హీరోయిన్ చార్మీ ..  గజాల .. సింగర్ గీతామాధురి .. యాంకర్ లాస్య .. తరుణ్ .. ఓంకార్ .. వరుణ్ సందేశ్ .. తనీష్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక రెండవ సీజన్ కి ఎన్టీఆర్ కి బదులు నాని హోస్ట్ గా వ్యవహరించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.    

  • Loading...

More Telugu News