US presidential election: 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు హ్యాక్ కాలేదు: స్పష్టం చేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ హెడ్

  • అధ్యక్ష ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందని ఆరోపణ
  • అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పిన డీహెచ్ఎస్

ఏడాది క్రితం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు హ్యాక్‌కు గురికాలేదని ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విభాగ హెడ్ జె జాన్సన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలపై సైబర్ దాడి జరిగినట్టు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఓటింగ్ విధానం హ్యాక్ అవలేదని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ వార్తల వల్ల అమెరికా ఓటింగ్ విధానం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిసిందని ఆయన పేర్కొన్నారు. లోపాలు తెలిసి వచ్చాయన్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన డీఎహెచ్ఎస్ అటువంటిదేమీ జరగలేదని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News