Russia: 11 రోజుల్లో 2 వేల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన రష్యా

  • సిరియాలో పెద్ద ఎత్తున హతమైన ఉగ్రవాదులు
  • శిబిరాలు, ఆయుధగారాలు ధ్వంసం
  • 2700 మందికి గాయాలు

సిరియాపై రష్యా వాయుసేన జరిపిన దాడుల్లో మొత్తం 2,359 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సెప్టెంబరు 19 నుంచి 29 మధ్య జరిపిన వాయుదాడుల్లో ఇస్లామిక్ స్టేట్, అల్-నుర్సా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హతమయ్యారు.

ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్, అల్-నుర్సాలకు ఈ దాడుల వల్ల పెను నష్టం జరిగిందని రష్యా దళాలు తెలిపాయి. దాడుల్లో 2,359 మంది ఉగ్రవాదులు హతమవగా, 2,700 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారిలో 16 మంది ఫీల్డ్ కమాండర్లు, 400 పౌరులు ఉన్నట్టు పేర్కొంది.

11 రోజులపాటు నిర్వహించిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన 67 ఉగ్రవాద శిబిరాలు, 51 ఆయుధగారాలు, 27 ట్యాంకులు, 21 రాకెట్ లాంచర్లు, 200 ప్రత్యేక వాహనాలు ధ్వంసమైనట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది.

More Telugu News