bullet train: బుల్లెట్ రైలు అందరినీ చంపుకుంటూ పోతుంది: చిదంబరం

  • బుల్లెట్ రైలు ముఖ్యం కాదు
  • భద్రత, మెరుగైన సదుపాయాలే ముఖ్యం
  • ఇవి సామాన్యులు ప్రయాణించే రైళ్లు కావు
  • ఈ ప్రాజెక్టు మరో నోట్ల రద్దు కార్యక్రమం లాంటిది

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టు కూడా అచ్చం నోట్ల రద్దు వంటిదేనని ఆయన విమర్శించారు. బుల్లెట్ రైలు అందరినీ చంపుకుంటూ పోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై జరిగిన విషాద ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయిన నేపథ్యంలో చిదంబరం ఈ విధంగా స్పందించారు.

బుల్లెట్ రైలుపై కాకుండా భద్రత, మెరుగైన సదుపాయాలపై రైల్వే శాఖ దృష్టిసారించాలని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయనుండటంపై చిదంబరం మండిపడ్డారు. బుల్లెట్ రైళ్లలో సామాన్యులు ప్రయాణించలేరని... కేవలం డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించగలరని అన్నారు. ట్విట్టర్ వేదికగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News