stallion: వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించండి.. నిజాలు బయటకొస్తాయ్: స్టాలిన్

  • రిటైర్డ్, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపితే ప్రయోజనం లేదు
  • గవర్నర్ ను కూడా విచారించాలి
  • ఎయిమ్స్ వైద్యులు, లండన్ వైద్యులను కూడా విచారించాలి

దివంగత జయలలిత మృతి గురించి మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మండిపడ్డారు. రిటైర్డ్ జడ్జిలు, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించినంత మాత్రాన నిజాలు బయటకు రావని... మంత్రులు సెల్లూరు రాజు, శ్రీనివాసన్ లకు లైడిటెక్టర్ పరీక్షలను నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. మంత్రులనే కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖులను, రాష్ట్ర గవర్నర్ ను సైతం ఈ విషయంలో విచారించాల్సి ఉందని చెప్పారు. ఎయిమ్స్ వైద్యులు, లండన్ వైద్యులను సైతం విచారించాలని... అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

More Telugu News