Chandrababu: పండుగ రోజు తాతామనవళ్ల సందడి.. పంచెకట్టుతో అలరించిన చంద్రబాబు, దేవాన్ష్

  • కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
  • పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • ఏ పని చేయాలన్నా దుష్ట శక్తులు అడ్డు పడుతున్నాయ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పంచెకట్టుతో అలరించాడు. ఈ రోజు చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలసి బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన తాతతో కలసి పంచెకట్టుతో దేవాన్ష్ ఆలయానికి వచ్చాడు. పూజ సమయంలో కూడా దేవాన్ష్ తన తాత ఒడిలోనే కూర్చున్నాడు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం, పోలవరం, వాటర్ గ్రిడ్, స్మార్ట్ పవర్ గ్రిడ్, స్వచ్ఛ్ తే సేవలు త్వరగా పూర్తి కావాలని సంకల్పం చేశానని చెప్పారు. సంప్రదాయాలు నేర్చుకోవాలనే మనవడిని తీసుకొచ్చానని ఆయన అన్నారు. ఏ మంచి పని చేయాలన్నా రాష్ట్రంలోని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News