gopichand: ఆకట్టుకునే డైలాగులతో 'ఆక్సిజన్' ట్రైలర్ విడుదల!

  • 'ఆక్సిజన్' ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రయూనిట్
  • ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 'ఆక్సిజన్'
గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన ‘ఆక్సిజన్‌’ ట్రైలర్ ను దర్శకుడు ఎ.ఎమ్‌. జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు.

‘సంతోషాన్ని పంచే అమ్మానాన్న... నవ్వుతూ పలకరించే ప్రియురాలు.. పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు.. లైఫ్‌ అంటే నాదే అనుకున్నాను. ఒక్కరోజు అంతా చీకటైపోయింది. నాకు జరిగింది.. మీకూ జరగచ్చు. కానీ అలా జరగనివ్వను’ అంటూ ఈ ట్రైలర్ లో గోపీచంద్ డైలాగ్ లు చెప్పడం వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కలర్ ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
gopichand
rasi khanna
niveda Thomas
oxygen

More Telugu News