Saudi: సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం.. 45 ఏళ్ల పురుషాధిక్యానికి చెల్లుచీటీ.. ఫత్వా జారీకి మహిళలకు అనుమతి!

  • వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ 
  • మొన్న స్టేడియంలోకి అనుమతి, నిన్న డ్రైవింగ్ నిబంధనలు ఎత్తివేత
  • తాజా నిర్ణయంపై ఇస్లామిక్ కమ్యూనిటీ హర్షం

ఇటీవల వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయానికి ఓటేసింది. 45 ఏళ్ల పురుషాధిపత్యానికి చెక్ చెప్పేలా ఫత్వా జారీకి మహిళలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సౌదీ అడ్వైజరీ కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్ ద్వారా ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది.  

ప్రభుత్వ తాజా నిర్ణయంతో చట్టబద్ధంగా శిక్షలు విధించే అవకాశం మహిళలకు దక్కినట్టు అయింది. నాలుగు రోజుల క్రితమే మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సౌదీ, ఈ నెలలోనే స్టేడియంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసి వారిని అనుమతించింది.

ఇస్లామిక్ న్యాయ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. షరియా చట్టాల్లో నిపుణుడైన అల్-బిషి మాట్లాడుతూ ముస్లిం సమాజంలో మహిళలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల ఈ ఇస్లామిక్ సమాజానికి మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News