kamal haasam: జయ బతికి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?: కమలహాసన్ కు విజయకాంత్ ప్రశ్న

  • జయ ఉన్నప్పుడు అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు
  • నేనొక్కడినే అతినీతిపై మాట్లాడాను
  • కరుణ ఆరోగ్యంగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న కమలహాసన్ పై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అవినీతిపై మాట్లాడుతున్న కమల్... జయలలిత బతికున్నప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అప్పుడు కమల్ కనీసం నోరు కూడా మెదపలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 జయ హయాంలో అవినీతిపై ధైర్యంగా నోరు విప్పింది తానేనని చెప్పారు. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంగా ఉండి ఉంటే అధికార పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. స్టాలిన్ మెతక వైఖరితో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని తెలిపారు. కమలహాసన్, రజనీకాంత్ ల రాజకీయ ప్రవేశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు.

  • Loading...

More Telugu News