Pakistan: పాక్ లో ఐదుగురు మంత్రులకు ఉగ్రవాదులతో లింకులు?

  • ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం
  • పాక్ మీడియాలో సంచలనాత్మక ఇంటెలిజెన్స్ నివేదిక
  • ఐదుగురు మంత్రులు, 37 మంది ఎంపీలకు ఉగ్రవాదులతో సంబంధాలు
ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న వేళ...ఆ దేశంలో ఉగ్రవాదులతో నేరుగా మంత్రివర్గ సభ్యులకే ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయి. ఉన్నతాధికారులు తన నివేదికలు తొక్కిపెడుతున్నారన్న ఇంటెలిజెన్స్ అధికారి పిటిషన్ నేపథ్యంలో మీడియా సంచలనాత్మక ఇంటెలిజెన్స్ నివేదికను బహిర్గతం చేసింది. ఈ నివేదికలో ఐదుగురు మంత్రులకు నేరుగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని పాక్ మీడియా వెల్లడించింది. అలాగే 37 మంది ఎంపీలకు వివిధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దీనిపై పెనుకలకలం రేగగా, ఈ నివేదిక బూటకపు ప్రచారమని ఆ దేశ ప్రధాని అబ్బాసీ వ్యాఖ్యానించారు. 
Pakistan
media
intelligence report
ministers relations

More Telugu News